India Vs Westindies : మ్యాచ్ తాజా అప్‌డేట్ ఇదీ..

ABN , First Publish Date - 2022-08-07T01:40:43+05:30 IST

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌కి వేదిక మారినా అదే సీన్ రిపీట్ అయ్యింది.

India Vs Westindies : మ్యాచ్ తాజా అప్‌డేట్ ఇదీ..

ఫ్లోరిడా :  ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌కి వేదిక మారినా ఆట మాత్రం షెడ్యూల్ ప్రకారం ఆరంభమవ్వలేదు. వర్షం కారణంగా టాస్ వాయిదాపడింది. అమెరికాలోని లాడర్‌హిల్ ఫ్లోరిడాలో మ్యాచ్ జరగాల్సిన ప్రాంతంలో వర్షం ఆటంకంగా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి వర్షం తగ్గడంతో పరిస్థితిని పరిశీలించారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. 8:15 గంటలకు టాస్ పడనుంది. ఇప్పుడిప్పుడే గ్రౌండ్‌లో కవర్స్ తొలగిస్తున్నారు. కాగా సిరీస్‌లో ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. టీమిండియా గెలిస్తే సిరీస్‌ను చేజిక్కించుకుంటుంది. ఇక వెస్టిండీస్ గెలుపొందితే సిరీస్ సమం అవుతుంది. విజేత ఎవరనేది 5వ మ్యాచ్‌లో తేలుతుంది.


తుది జట్ల అంచనా ఇదీ..

ఇండియా జట్టు అంచనా : 1.రోహిత్ శర్మ(కెప్టెన్), 2.సూర్యకుమార్ యాదవ్, 3.శ్రేయస్ అయ్యర్, 4. రిషబ్ పంత్(వికెట్ కీపర్), 5. హార్దిక్ పాండ్యా, 6.దినేష్ కార్తీక్, 7.రవీంద్ర జడేజా, 8.హర్షల్ పటేల్, 9.ఆర్ అశ్విన్, 10.యజువేంద్ర చహాల్, 11.అర్షదీప్ సింగ్.

వెస్టిండీస్ జట్టు అంచనా : 1. కైల్ మయర్స్, 2.బ్రండన్ కింగ్, 3. నికోలస్ పూరన్(కెప్టెన్), 4.షిమ్రోన్ హెట్మేయర్, 5. రోవ్‌మ్యాన్ పావెల్, 6.డెవొన్ థామస్(వికెట్ కీపర్), 7. జసన్ హోల్డర్, 8.అకీల్ హోసిన్, 9.డొమినిక్ డ్రేక్స్, 10.అల్జార్రీ జోసెఫ్, 11.ఒబెడ్ మెక్‌కే.


పిచ్ రిపోర్ట్..

అమెరికా(USA)లోని ఫ్లోరిడా(Florida) ‘సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్’ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా జరగకపోవడంతో పిచ్‌ను అంచనా వేయడం సంక్లిష్టం. అయితే బౌండరీలు చిన్నగా ఉన్నాయి. షాట్లు ఆడితే సిక్సర్లు ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి. అక్కడి ప్రవాస భారతీయ క్రికెట్ అభిమానులను ఈ మ్యాచ్ అలరించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more