Riyan Parag: వామ్మో.. మరీ ఈ రేంజ్‌లోనా.. రియాన్ పరాగ్‌పై ఎంత రగిలిపోతున్నారో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-05-31T00:15:10+05:30 IST

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలని పక్కన పెడితే ఒక ఆటగాడిపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. అతను మరెవరో కాదు రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో...

Riyan Parag: వామ్మో.. మరీ ఈ రేంజ్‌లోనా.. రియాన్ పరాగ్‌పై ఎంత రగిలిపోతున్నారో మీరే చూడండి..

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలని పక్కన పెడితే ఒక ఆటగాడిపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. అతను మరెవరో కాదు రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఇతని నుంచి RR ఫ్యాన్స్ ఎంతో ఆశించారు. కానీ.. పరాగ్ మాత్రం 15 బంతుల్లో 15 మాత్రమే కొట్టి షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంత చెత్తగా బ్యాటింగ్ చేసిన పరాగ్ ఇకనైనా తీరు మార్చుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Death Oversలో ఇంత చెత్తగా ఆడటం పరాగ్‌కే చెల్లిందని రాజస్తాన్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇతని కంటే బౌలర్ మెక్కోయ్ మేలని ట్వీట్స్ చేస్తున్నారు. Death Oversలో సిక్స్ కొట్టి దూకుడుగా ఆడాడని.. ఆ మాత్రం కసి కూడా లేకుండా పరాగ్ పేలవంగా ఆడటం ఏంటని నెటిజన్లు RR Fans గరంగరం అవుతున్నారు. కనీసం Big Shots ఆడే ప్రయత్నం కూడా రియాన్ పరాగ్ చేయలేదని RR ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.



ట్రెంట్ బౌల్ట్, మెక్కోయ్ 12 బంతుల్లో 19 కొట్టారని.. అందులో రెండు సిక్స్‌లు ఉన్నాయని.. కానీ రియాన్ పరాగ్ 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడని.. అందులో ఒక్క ఫోర్ మాత్రమే కొట్టాడని.. జట్టులో పరాగ్ పాత్ర ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. క్వాలిఫైయర్-2 సమయంలో కూడా రియాన్ పరాగ్‌పై ట్రోల్స్ వచ్చాయి. రజత్ పటిదార్ క్యాచ్‌ను పరాగ్ జారవిడవడంతో పరాగ్‌ను గట్టిగానే ట్రోల్ చేశారు. అయితే.. ఆ మ్యాచ్‌లో RR గెలవడంతో పరాగ్ సేఫ్ అయ్యాడు. కానీ.. ఫైనల్ మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో ట్రోలర్స్‌కు పరాగ్ మరోసారి టార్గెట్ కావడం గమనార్హం. ఈ ఐపీఎల్ సీజన్‌లో 17 మ్యాచులు ఆడిన ఈ అస్సోం క్రికెటర్ 183 పరుగులు మాత్రమే చేశాడు.







Updated Date - 2022-05-31T00:15:10+05:30 IST