మినీ వేలం డిసెంబరు 16న?

ABN , First Publish Date - 2022-10-17T09:45:06+05:30 IST

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలం డిసెంబరు16న బెంగళూరులో జరిగే అవకాశముంది.

మినీ వేలం  డిసెంబరు 16న?

ఒక్కో జట్టు గరిష్ట ఖర్చు రూ.95 కోట్లు

ముంబై: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలం డిసెంబరు16న బెంగళూరులో జరిగే అవకాశముంది. ఈసారి ఒక్కో జట్టు ఖర్చు చేసే మొత్తాన్ని మరో ఐదు కోట్లకు పెంచనున్నారు. అంటే ప్రతీ జట్టు తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం గరిష్ఠంగా రూ.95 కోట్లు వినియోగించుకోవచ్చు. అయితే వేలం జరిగే తేదీపై ఈనెల 18న జరిగే ఐపీఎల్‌ పాలక మండలిలో తుది నిర్ణయం తీసుకుంటారు. గత సీజన్‌లోనే భారీ స్థాయిలో వేలం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఒక రోజు పాటే కొనసాగనుందని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. డిసెంబరు 1 నుంచి 5 లోపు జట్లు వదిలేసుకునే, అట్టిపెట్టుకునే ప్లేయర్స్‌ జాబితాను విడుదల చేస్తారు.


ఇక వేలానికి ముందు వారం రోజులపాటు ప్లేయర్స్‌ బదిలీల కోసం ట్రేడింగ్‌ విండో ఉంటుంది. ఇప్పటిదాకా చెన్నైకి ఆడిన జడేజా ఏ జట్టుకు  బదిలీ అవుతాడనేది కూడా ఇందులోనే తేలనుంది. సీఎ్‌సకేతో అతడికి మూడేళ్ల ఒప్పందం ఉన్నా కెప్టెన్సీ నుంచి తొలగించాక జట్టుతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాడు. ఇప్పటికే అతడి కోసం వివిధ జట్లు సంప్రదించినా చెన్నై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు వచ్చే సీజన్‌ నుంచి లీగ్‌ మ్యాచ్‌లు ఇంటా, బయట పద్దతిన జరుగుతాయని బోర్డు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-17T09:45:06+05:30 IST