Meenakshi: కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రమాదం.. సైక్లిస్ట్ మీనాక్షి పైనుంచి దూసుకెళ్లిన మరో సైక్లిస్ట్: వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-08-02T21:51:54+05:30 IST
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత సైక్లిస్ట్ మీనాక్షి (Meenakshi) గాయపడింది. 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్‌లో పాల్గొన్న
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత సైక్లిస్ట్ మీనాక్షి (Meenakshi) గాయపడింది. 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్‌లో పాల్గొన్న మీనాక్షి కాసేపటికే ప్రమాదవశాత్త సైకిలు పైనుంచి కిందపడి ట్రాకప్ జారుకుంటూ పోయింది. అదే సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొస్తున్న న్యూజిలాండ్ సైక్లిస్ట్ బ్రయోనీ బోథా మీనాక్షిని ఢీకొట్టి ఆమె మీదుగా దూసుకెళ్లి కిందపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన మెడికోలు మీనాక్షిని స్ట్రెచర్‌పై బయటకు తరలించారు. ఇద్దరినీ పోటీ నుంచి తప్పించారు. ఈ పోటీలో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ (Laura Kenny) బంగారు పతకం సాధించింది. కాగా, ట్రాక్‌పై ప్రమాదం జరగడం రెండో రోజుల్లో ఇది రెండోసారి. ఇంగ్లండ్‌కు చెందిన మ్యాట్ వాల్స్ కూడా ఇలాగే సైకిలుపై నుంచి జారి కిందపడింది.