Blind T20 World Cup 2022: రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియా.. బ్లైండ్ టీ20 వరల్డ్ కప్ మూడోసారీ మనదే!

ABN , First Publish Date - 2022-12-17T17:53:07+05:30 IST

టీమిండియా అంధుల క్రికెట్ జట్టు (Team India Blind Cricket Team) చరిత్ర సృష్టించింది.

Blind T20 World Cup 2022: రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియా..  బ్లైండ్ టీ20 వరల్డ్ కప్ మూడోసారీ మనదే!
Team India blind team

బెంగళూరు: టీమిండియా అంధుల క్రికెట్ జట్టు (Team India Blind Cricket Team) చరిత్ర సృష్టించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు (17న) బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరిగిన ఫైనల్‌లో120 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను వరుసగా మూడోసారి ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

అనంతరం 278 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. గతంలో 2012, 2017 ప్రపంచకప్‌లను సొంతం చేసుకున్న టీమిండియా వరుసగా మూడోసారి కూడా టైటిల్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. అంధుల టీ20 ప్రంపచ కప్‌ను మూడోసారి చేజిక్కించుకున్న భారత్‌పై తాజా, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2022-12-17T17:53:11+05:30 IST