ప్రపంచ మహిళల బాక్సింగ్‌కు భారత్‌ ఆతిథ్యం

ABN , First Publish Date - 2022-11-10T05:45:38+05:30 IST

వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం ..

ప్రపంచ మహిళల బాక్సింగ్‌కు భారత్‌ ఆతిథ్యం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ) చీఫ్‌ అజయ్‌ సింగ్‌, ఐబీఏ అధ్యక్షుడు ఉమర్‌ క్రెమ్లెవ్‌ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈసారి టోర్నీ ఓవరాల్‌ ప్రైజ్‌మనీని రూ. 19.50 కోట్లకు పెంచారు. స్వర్ణ పతక విజేతకు రూ. 81 లక్షలు దక్కనున్నాయి. ఇక, ఈ మెగా ఈవెంట్‌ భారత్‌లో జరగడం ఇది మూడోసారి. గతంలో 2006, 2018లో ఇక్కడ నిర్వహించారు. అయితే, పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ మాత్రం ఇప్పటిదాకా భారత్‌లో జరగలేదు.

Updated Date - 2022-11-10T05:45:39+05:30 IST