india vs pakistan asia cup : భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తేదీ.. ఏ టైమ్‌కి ఏ ఛానల్లో ప్రసారం కానుందంటే..
ABN , First Publish Date - 2022-08-24T22:10:23+05:30 IST
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆసియా కప్2022 (Asia Cup) ఆసన్నమైంది. ఆగస్టు 27 నుంచి పొట్టి ఫార్మాట్‌లో ఈ క్రికెట్ సమరం ఆరంభమవనుంది.
ముంబై : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆసియా కప్2022 (Asia Cup) ఆసన్నమైంది. ఆగస్టు 27 నుంచి పొట్టి ఫార్మాట్‌లో ఈ క్రికెట్ సమరం ఆరంభమవనుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఆడనున్నాయి. మరుసటి రోజు గ్రూప్-Aలోని దాయాది దేశాలు భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India Vs pakistan) ఆగస్టు 28న(ఆదివారం) తలపడనున్నాయి. మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలని ఇరుదేశాలు కసితో ఎదురుచూస్తున్నాయి. కాగా టీ20 వరల్డ్ కప్ 2021లో చివరిసారిగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది.
మ్యాచ్ టైం, ఛానల్..
ఆగస్టు 28న భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభమవనుంది. యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. భారత్‌లో ఆసియా కప్ 2022 అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్‌గా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్(Star Sports Network) వ్యవహరిస్తోంది. కాబట్టి స్టార్ స్పోర్ట్స్(Star Sports) నెట్‌వర్క్ ఛానల్స్‌లో ఇండియా-పాకిస్తాన్ సమరం ప్రత్యక్ష ప్రసారం కానుంది. మరోవైపు డిస్నీ+హాస్ట్‌స్టార్ (Disney+ Hotstar) లైవ్‌స్ట్రీమింగ్(Live Streaming) చేయనుంది. మధ్య ఆసియా దేశాల్లోని ఎన్నారైలు ‘ఓఎస్ఎన్ స్పోర్ట్స్ క్రికెట్(OSN Sports Cricket)లో మ్యాచ్ లైవ్ యాక్షన్ వీక్షించవచ్చు.
తుది జట్ల అంచనా..
భారత్ జట్టు(అంచనా) : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్,
పాకిస్తాన్ జట్టు(అంచనా) : బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహ్మద్ వసీం (జూనియర్), హరిస్ రౌఫ, షానావజ్ దహానీ.
ఆసియా కప్‌లో ఇండియా షెడ్యూల్..
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-Aలో ఉన్నాయి. మరో క్వాలిఫయర్ జట్టు ఈ గ్రూప్‌లో చేరనుంది. ఇక గ్రూప్-Bలో శ్రీలంక, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక వర్సెస్ ఆప్ఘనిస్తాన్ ఆడనున్నాయి.
- ఇండియా Vs పాకిస్తాన్ (ఆగస్టు 28)
- ఇండియా Vs గ్రూప్-ఏ క్వాలిఫయర్ (ఆగస్టు 31)
సెమీస్ షెడ్యూల్ గ్రూప్ దశ సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరగనుంది.
