రిచా అదరగొట్టినా..!

ABN , First Publish Date - 2022-02-23T08:57:16+05:30 IST

రిచా ఘోష్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధ శతకంతో అదరగొట్టినా.. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో టీమిం డియా 63 పరుగులతో ఓటమి పాలైంది.

రిచా అదరగొట్టినా..!

కివీస్‌తో నాలుగో వన్డేలో భారత్‌ ఓటమి

క్వీన్స్‌టన్‌:  రిచా ఘోష్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధ శతకంతో అదరగొట్టినా.. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో టీమిం డియా 63 పరుగులతో ఓటమి పాలైంది. వర్షం కార ణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌ 191/5 స్కోరు చేసింది. కెర్‌ (68 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో దుమ్ము రేపింది. ఛేదనలో భారత్‌ 17.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. మంధాన (13), షఫాలీ (0), యాస్తిక (0), పూజా (4)ను కోల్పోయిన భారత్‌ 19/4తో ఆశలు వదిలేసుకొంది. కానీ, మిథాలీ (30)-రిచా ఐదో వికెట్‌కు 77 రన్స్‌ జత చేశారు. అయితే, రిచా అవుటవగానే భారత బ్యాటింగ్‌ కుప్పకూలింది. కెర్‌, జాన్సన్‌ చెరో 3 వికెట్లు తీశారు. కాగా, గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 37, 4, 49, 61 రన్స్‌ చేసిన తెలుగ మ్మాయి సబ్బినేని మేఘనను ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక..ఐదు వన్డేల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలో ఉన్న కివీస్‌ క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకెళ్తోంది. 

Read more