సఫారీల గ్రూప్‌లో భారత్
ABN , First Publish Date - 2022-12-15T02:45:42+05:30 IST
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ డ్రాను విడుదల చేశారు. వచ్చే జనవరి 14 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు దక్షిణాఫ్రికా
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ డ్రా విడుదల
ర్యాంగ్‌పో (సిక్కిం): అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ డ్రాను విడుదల చేశారు. వచ్చే జనవరి 14 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తోంది. గ్రూప్-డిలో సౌతాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈలతో కలిసి భారత్ అదృష్టాన్ని పరీక్షించుకో నుంది. గ్రూప్-ఎ నుంచి ఫేవరెట్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్-బి తరఫున ఇంగ్లండ్, పాకిస్థాన్, రువాండా, జింబా బ్వే; గ్రూప్-సి నుంచి న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇండోనేసియా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లోని టాపర్ నేరుగా సెమీఫైనల్ దశకు చేరుతుంది. భారత జట్టుకు తెలుగ మ్మాయిలు త్రిష, షబ్నమ్ ఎంపికయ్యారు.