టాయ్‌లెట్‌లోనే భోజనాలు

ABN , First Publish Date - 2022-09-21T09:25:44+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. కబడ్డీ క్రీడాకారిణులకు ఘోర అవమానం ఎదురైంది.

టాయ్‌లెట్‌లోనే  భోజనాలు

 కబడ్డీ క్రీడాకారిణులకు ఘోర అవమానం

సహరన్‌పూర్‌ (యూపీ): అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. కబడ్డీ క్రీడాకారిణులకు ఘోర అవమానం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌-16 బాలికల కబడ్డీ ప్లేయర్లు టాయ్‌లెట్లలో భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోర్నీ కోసం సుమారు 200 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి మధ్యాహ్న భోజనాన్ని స్టేడియం టాయ్‌లెట్‌లో ఏర్పాటు చేశారు. టాయ్‌లెట్‌లో అన్నం, పప్పు పాత్రలతోపాటు ఓ పేపర్‌పై పూరీలను కూడా ఉంచారు. ఆ బాలికలు వాటినే తమ ప్లేట్లలో వడ్డించుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీన్ని సీరియస్‌గా తీసుకొన్న ప్రభుత్వం సహరన్‌పూర్‌ క్రీడా అధికారి అనిమేష్‌ సక్సేనాను సస్పెండ్‌ చేసింది. Read more