హైదరాబాద్‌ పరాజయం

ABN , First Publish Date - 2022-10-17T09:57:38+05:30 IST

సీనియర్‌ మహిళల టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 10 వికెట్లతో ఆంధ్ర చేతిలో ఓడింది.

హైదరాబాద్‌ పరాజయం

బెంగళూరు: సీనియర్‌ మహిళల టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 10 వికెట్లతో ఆంధ్ర చేతిలో ఓడింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలుత 15 ఓవర్లలో 52/5 స్కోరు చేసింది. త్రిష (30) టాప్‌స్కోరర్‌. దేవిక రెండు, పద్మజ, శరణ్య చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 55 పరుగులు చేసి నెగ్గింది. అనూష (39), స్నేహ (24) నాటౌట్‌గా నిలిచారు. 

Updated Date - 2022-10-17T09:57:38+05:30 IST