హైదరాబాద్ 28/0
ABN , First Publish Date - 2022-12-16T00:11:32+05:30 IST
తమిళనాడుతో ఇక్కడ జరుగుతున్న గ్రూప్ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ మూడో రోజు ఆఖరికి రెండో ఇన్నింగ్స్‌లో
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తమిళనాడుతో ఇక్కడ జరుగుతున్న గ్రూప్ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ మూడో రోజు ఆఖరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆతిథ్య హైదరాబాద్ ఇంకా 87 పరుగులు వెనుకంజలో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 203/0తో గురువారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు 510/4 స్కోరుతో డిక్లేర్ చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 179, జగదీశన్ 116 రన్స్‌కు అవుటయ్యారు. బాబా అపరాజిత్ (115) అజేయంగా నిలిచాడు. త్యాగరాజన్ 2 వికెట్లు తీశాడు. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 395 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే. విజయనగరంలో ముంబైతో జరిగిన మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర 9 వికెట్లతో పరాజయం పాలైంది.