Hardik Pandya: కీరన్ పొలార్డ్ ఇంటికెళ్లిన టీమిండియా స్టార్ బ్యాటర్
ABN , First Publish Date - 2022-08-05T03:06:28+05:30 IST
టీమిండియా స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా తన ముంబై ఇండియన్స్ మాజీ టీమ్మేట్ కీరన్ పొలార్డ్ ఇంటికి వెళ్లాడు. పొలార్డ్
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా తన ముంబై ఇండియన్స్ మాజీ టీమ్మేట్ కీరన్ పొలార్డ్ ఇంటికి వెళ్లాడు. పొలార్డ్ కుటుంబంతో ఆనందగా గడిపాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలోనే ఉన్న భారత జట్టు వన్డే సిరీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. మూడు మ్యాచుల్లో రెండింటిని గెలుచుకున్న టీమిండియా 2-1 ఆధిక్యంతో ఉంది.
ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్‌కు ముందు కొంత సమయం దొరకడంతో పాండ్యా ఇలా విండీస్ క్రికెటర్ ఇంట్లో వాలిపోయాడు. అతడి కుటుంబంతో ఆనందంగా గడిపిన పాండ్యా.. కుటుంబంతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కింగ్స్ హోమ్‌ను సందర్శించకుండా విండీస్ పర్యటన పూర్తికాదని రాసుకొచ్చాడు. పొలార్డ్ తన ఫేవరెట్ క్రికెటరని పేర్కొన్న పాండ్యా.. తనకు ఆతిథ్యం అందించినందుకు ‘థ్యాంక్యూ మై బ్రదర్’ అంటూ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.