జ్యోతికకు కాంస్యం

ABN , First Publish Date - 2022-04-04T09:46:22+05:30 IST

ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి దండి జ్యోతిక కాంస్య పతకంతో మెరిసింది.

జ్యోతికకు కాంస్యం

 ఫెడరేషన్‌ కప్‌లో ద్యూతికి స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి దండి జ్యోతిక కాంస్య పతకంతో మెరిసింది. ఆదివారం కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతిక 53.90 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడోస్థానంలో నిలిచింది. ఐశ్వర్య (మహారాష్ట్ర), పూవమ్మ (కర్ణాటక) స్వర్ణ, రజతాలను దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక ప్రస్తుతం ‘సాయ్‌’ హైదరాబాద్‌ కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. జ్యోతికకు సీనియర్‌ కేటగిరీలో ఇదే తొలి పతకం. ఇక, భారత స్థార్‌ అథ్లెట్‌ ద్యూతీ చంద్‌ (ఒడిశా) మహిళల 100 మీ. పరుగులో స్వర్ణం సాధించింది. జిల్నా, సిమి తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు.

Updated Date - 2022-04-04T09:46:22+05:30 IST