గిల్‌ సరసన సారా 2.0

ABN , First Publish Date - 2022-08-31T09:30:43+05:30 IST

కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌ కనబరుస్తున్న భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మైదానం వెలుపలా బిజీగానే కనిపిస్తున్నాడు. గతంలో సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌తో అతడు..

గిల్‌ సరసన సారా 2.0

న్యూఢిల్లీ: కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌ కనబరుస్తున్న భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మైదానం వెలుపలా బిజీగానే కనిపిస్తున్నాడు. గతంలో సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌తో అతడు డేటింగ్‌లో ఉన్నట్టు కథనాలు వినిపించాయి. సోషల్‌ మీడియాలో ఒకరికి మద్దతుగా మరొకరు కామెంట్స్‌ పెట్టేవారు. ఇప్పుడు వాటికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. తాజాగా గిల్‌ చెంత మరో సారా కనిపిస్తోంది. ఇప్పుడతను బాలీవుడ్‌ నటి సారా అలీ ఖాన్‌తో షికారు చేస్తున్నట్టు సమాచారం. దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ కలిసిఉన్న ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో వీరిద్దరూ ప్రేమాయణంలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సారా.. దిగ్గజ క్రికెటర్‌ మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ మనువరాలు కావడం విశేషం. అలాగే సారా గతంలో బాలీవుడ్‌ హీరో కార్తీర్‌ ఆర్యన్‌తో డేటింగ్‌ చేసింది.

Read more