Womens T20 Challenge 2022: దంచికొట్టిన మేఘన, జెమీమా.. వెలాసిటీ ఎదుట కొండంత లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-27T02:59:37+05:30 IST
మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా వెలాసిటీతో జరుగుతున్న మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్

పూణె: మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా వెలాసిటీతో జరుగుతున్న మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ భారీ స్కోరు సాధించింది. సాభినేని మేఘన, జెమీమా రోడ్రిగ్స్ అర్ధ సెంచరీలతో విరుచుకుపడడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి వెలాసిటీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మేఘన 47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, రోడ్రిగ్స్ 44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 66 పరుగులు చేసింది. స్మృతి మంధాన ఒక్క పరుగుకే అవుట్ కాగా, హేలీ మాథ్యూస్ 27, డంక్లీ 19 పరుగులు చేసింది. వెలాసిటీ బౌలర్లలో సిమ్రన్ బహదూర్‌కి రెండు వికెట్లు దక్కాయి.