రాణించిన రుతురాజ్, రాయుడు.. టైటాన్స్ ఎదుట ఓ మాదిరి లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-18T02:55:06+05:30 IST

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు

రాణించిన రుతురాజ్, రాయుడు.. టైటాన్స్ ఎదుట ఓ మాదిరి లక్ష్యం

పూణె: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, అంబటి రాయుడు 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు.


చివర్లో రవీంద్ర జడేజా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులు చేయడంతో స్కోరు 160 పరుగులు దాటింది. రాబిన్ ఉతప్ప 3, మొయిన్ అలీ 1, శివమ్ దూబే 19 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీసుకోగా, షమీ, యశ్ దయాళ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2022-04-18T02:55:06+05:30 IST