టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి బుమ్రా అవుట్‌

ABN , First Publish Date - 2022-10-04T09:02:03+05:30 IST

ఊహించిందే జరిగింది. పేస్‌ గన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయంతో టీ20 ప్రపంచ క్‌పనకు దూరమయ్యాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి   బుమ్రా అవుట్‌

ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జై షా

న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. పేస్‌ గన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయంతో టీ20 ప్రపంచ క్‌పనకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. బుమ్రా వెన్ను గాయం సంగతి గతనెల 29వ తేదీనే బయటపడినా.. వైద్య నివేదిక కోసం బోర్డు ఎదురుచూసింది. రిహాబిలిటేషన్‌ కోసం ఇప్పటిదాకా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో గడిపిన బుమ్రాకు కొన్ని నెలలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో విశ్వ సమరానికి అతడు దూరమవక తప్పడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌ కోసం బుమ్రా స్థానంలో షమి లేదా దీపక్‌ చాహర్‌లలో ఒకరు జట్టులోకి రానున్నారు. టీ20 ప్రపంచ కప్‌ ఈనెల 16న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. 

Read more