ఆసీస్‌ మాజీ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ మృతి

ABN , First Publish Date - 2022-03-05T09:42:14+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్నీ మార్ష్‌ (74) శుక్రవారం మరణించాడు.

ఆసీస్‌ మాజీ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ మృతి

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్నీ మార్ష్‌ (74) శుక్రవారం మరణించాడు. గతవారం గుండెపోటుకు గురైన అతడు ఇక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్ష్‌ 1970-84 మధ్య 96 టెస్ట్‌ల్లో ఆసీ్‌సకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు శతకాలతో 3633 పరుగులు చేసిన అతడు 355 మంది అవుట్‌లలో పాలుపంచుకున్నాడు. ఇక 92 వన్డేలు ఆడిన మార్ష్‌ 1225 పరుగులు చేయడంతోపాటు 124 మంది అవుట్‌లలో భాగస్వామి అయ్యాడు. 

Updated Date - 2022-03-05T09:42:14+05:30 IST