సిరీస్‌పై గురి

ABN , First Publish Date - 2022-11-22T03:02:27+05:30 IST

టీ20 ప్రపంచక్‌పలో పరాభవం కారణంగా పొట్టి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలివ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

సిరీస్‌పై గురి

మ.12 నుంచి డీడీ స్పోర్ట్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లో..

శాంసన్‌, ఉమ్రాన్‌లకు చోటిస్తారా?

నేడు కివీస్‌తో మూడో టీ20

నేపియర్‌: టీ20 ప్రపంచక్‌పలో పరాభవం కారణంగా పొట్టి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలివ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కానీ తొలి మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో టీ20 సిరీస్‌ రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌ నేటి ఆఖరి టీ20లోనూ గెలిచి సిరీ్‌సను దక్కించుకోవాలనుకుంటోంది. మరోవైపు ఈ ఫార్మాట్‌లో అదరగొట్టే సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురవుతోంది. ప్రపంచకప్‌ జట్టుకే ఎంపికవుతాడనుకుంటే సెలెక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఇప్పుడు కివీస్‌ టూర్‌కు వచ్చినా అవకాశం దక్కలేదు. అందుకే ఈ చివరి మ్యాచ్‌లోనైనా అతడిని పరీక్షిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో స్పీడ్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను పక్కనబెట్టడం కూడా ఆశ్చర్యపరిచింది. అతడికి తగినన్ని అవకాశాలు ఇస్తే ఒత్తిడిని అధిగమిస్తూ తన లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

విలియమ్సన్‌ దూరం: ముందే బుక్‌ చేసుకున్న మెడికల్‌ అపాయింట్‌మెంట్‌ కారణంగా కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులో ఉండడం లేదు. దీంతో మ్యాచ్‌కు సౌథీ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, కేన్‌ స్థానంలో మార్క్‌ చాప్‌మన్‌కు పిలుపందింది.

పిచ్‌, వాతావరణం: నేపియర్‌లోని మెక్‌లీన్‌ పార్క్‌లో భారత జట్టుకిదే తొలి టీ20. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. మధ్యాహ్నం వర్షం కురిసినా మ్యాచ్‌ సమయానికి పరిస్థితి అనుకూలించవచ్చు. బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో బ్యాటర్లకు పండగే.

తుది జట్లు (అంచనా): భారత్‌: పంత్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌, శ్రేయా్‌స/శాంసన్‌, హుడా, హార్దిక్‌ (కెప్టెన్‌), సుందర్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీ్‌ప/ఉమ్రాన్‌, సిరాజ్‌, చాహల్‌.

న్యూజిలాండ్‌: ఆలెన్‌, కాన్వే, చాప్‌మన్‌, ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ (కెప్టెన్‌), మిల్నే, సోధీ, ఫెర్గూసన్‌.

Updated Date - 2022-11-22T03:02:28+05:30 IST