మాటల్లో చెప్పలేని విషాదం

ABN , First Publish Date - 2022-10-03T09:12:44+05:30 IST

ఇండోనేసియాలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన మాటల్లో చెప్పలేని విషాదమని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిపా) అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాన్‌టినో అన్నారు.

మాటల్లో చెప్పలేని విషాదం

‘ఇండోనేసియా’ ఘటనపై ఫిఫా చీఫ్‌ ఇన్‌ఫాన్‌టినో

పారిస్‌: ఇండోనేసియాలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన మాటల్లో చెప్పలేని విషాదమని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిపా) అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాన్‌టినో అన్నారు. మలాంగ్‌లోని కంజురుహాన్‌ స్టేడియంలో శనివారం రాత్రి అరెమా ఫుట్‌బాల్‌ క్లబ్‌-పెర్సెబాయా సురబాయ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో జరిగిన తొక్కిసలాటలో 125 మంది మరణించారు. ‘ఈ విషాద ఘటనతో ఫుట్‌బాల్‌ ప్రపంచం షాక్‌కు లోనైంది. మృతులకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో ఇండోనేసియాకు ఫిఫా తోడుగా ఉంటుంది’ అని ఇన్‌ఫాన్‌టినో పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-03T09:12:44+05:30 IST