FIFA World Cup 2022: మహిళా ఫ్యాన్స్‌‌కు ఖతార్ షరతులు.. ఏంటో తెలుసా...

ABN , First Publish Date - 2022-11-16T19:44:40+05:30 IST

ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎడిషన్‌కు (FIFA World Cup 2022) గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) ఆతిథ్యమిస్తోంది. నవంబర్ 20న ఖతార్ వర్సెస్ ఈక్వెడార్ (Qatar Vs Equador ) కీలక మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కాబోతోంది.

FIFA World Cup 2022: మహిళా ఫ్యాన్స్‌‌కు ఖతార్ షరతులు.. ఏంటో తెలుసా...

దోహా : ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎడిషన్‌కు (FIFA World Cup 2022) గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) ఆతిథ్యమిస్తోంది. నవంబర్ 20న ఖతార్ వర్సెస్ ఈక్వెడార్ (Qatar Vs Equador ) కీలక మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కాబోతోంది. మొత్తం 32 జట్లు పాల్గొంటున్న ఈ ఫుట్‌బాల్‌ పండగను వీక్షించేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఖతార్ చేరుకున్నారు. ఇంకా చాలామంది అక్కడికి పయనమవనున్నారు. మ్యాచ్‌లతోపాటు అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుంటారు. కానీ ఒక విషయంలో ఆతిథ్య దేశం విమర్శ ఎదుర్కొంటోంది.

విదేశాలకు చెందిన మహిళలు ఖతార్ చట్టాలను దృష్టిలో ఉంచుకుని.. శరీర భాగాలు మరీ ఎక్కువగా కనిపించే దుస్తులు ధరించవద్దని ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఆతిథ్య దేశం కోరుతోంది. వీక్షకులు తాము ఎంపిక చేసిన దుస్తులను ధరించవచ్చునని ఫిఫా వెబ్‌సైట్ చెబుతున్నప్పటికీ.. స్థానిక చట్టాలను గౌరవిస్తూ దుస్తులు ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రేక్షకులు శరీర భాగాలను కప్పి ఉంచుకునేలా జాగ్రత్తపడాలని సూచించింది. ‘‘ జనాలు సాధారణంగా వారికి నచ్చిన దుస్తులనే ధరిస్తారు. అయితే సందర్శకులు ఖతార్‌లోని మ్యూజియాలు, ఇతర ప్రభుత్వ భవనాలు వంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు భుజాలు, మోకాళ్లను దుస్తులతో కప్పివుంచుకుంటారని ఆశిస్తున్నాం’’ అని ఫిఫా వెబ్‌సైట్ పేర్కొంది. కాగా ఖతార్‌లో మహిళలు బిగువైన, ఛాతి భాగం ఎక్కువగా కనిపించే దుస్తులు ధరించడంపై నిషేధం ఉందని ‘ది సన్’ రిపోర్ట్ పేర్కొంది. ప్రత్యేక కెమెరాలతో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను గుర్తించనున్నారని పేర్కొంది. కాగా ఈ తరహా ఆంక్షలు యూకే, యూఎస్ఏ, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి ఖతార్‌ వెళ్లే ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసేనని చెప్పాలి.

Updated Date - 2022-11-16T19:48:35+05:30 IST