IPLలో వేగంగా 2 వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..

ABN , First Publish Date - 2022-05-17T03:26:44+05:30 IST

ముంబై : IPLలో కొందరు ఆటగాళ్లు తక్కువ బంతుల్లోనే వేగంగా 2 వేల పరుగుల మైలురాయిని అందుకుని శెభాష్ అనిపించారు. అందులో టాప్-5 ఆటగాళ్లు ఎవరు, ఎన్ని బంతుల్లో 2 వేల పరుగులు పూర్తి చేశారో చూద్దాం...

IPLలో వేగంగా 2 వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..

ముంబై : IPLలో కొందరు ఆటగాళ్లు తక్కువ బంతుల్లోనే వేగంగా 2 వేల పరుగుల మైలురాయిని అందుకుని శెభాష్ అనిపించారు. అందులో టాప్-5 ఆటగాళ్లు ఎవరు, ఎన్ని బంతుల్లో 2 వేల పరుగులు పూర్తి చేశారో చూద్దాం... ప్రస్తుతం కలకత్తా నైట్‌రైడర్స్ తరపున దమ్మురేపుతున్న స్టార్‌ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఐపీఎల్‌లో అందరికంటే వేగంగా 2 వేల పరుగుల మైలురాయిని సాధించాడు. కేవలం 1120 బంతుల్లోనే 2 వేల పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. 1211 బంతుల్లో 2 వేల పరుగులు సాధించాడు. ఇక మూడో స్థానంలో సిక్సర్ల సునామీ క్రిస్ గేల్ నిలిచాడు. 1251 బంతుల్లో 2 వేల పరుగులు సాధించాడు. 1306 బంతుల్లో 2 వేల పరుగులతో రిషబ్ పంత్ 4వ స్థానంలో ఉండగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడు 1309 బంతుల్లో 2 వేల పరుగులు బాదాడు.

Read more