చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. కుప్పకూలిన టీమిండియా..!

ABN , First Publish Date - 2022-03-16T14:47:56+05:30 IST

మహిళల ప్రపంచకప్‎లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తడబడింది.

చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. కుప్పకూలిన టీమిండియా..!

మౌంట్‌ మాంగనుయ్‌: మహిళల ప్రపంచకప్‎లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి భారత బ్యాటర్లు ఏ ఒక్కరూ కూడా నిలబడలేకపోయారు. స్మృతి మంధాన(35), రిచా ఘోస్(33), ఝలన్ గోస్వామి(20) పరుగులతో కొద్దిసేపు పోరాడిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు భారత ఇన్నింగ్ 36.2 ఓవర్లలో 134 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ 4 వికెట్లతో రాణించగా.. అన్యా రెండు వికెట్లు, సోఫీ, కేట్ క్రాస్ తలో వికెట్ పడగొట్టారు.  Updated Date - 2022-03-16T14:47:56+05:30 IST

Read more