టీ20ల్లో డబుల్ సెంచరీ
ABN , First Publish Date - 2022-10-07T09:03:09+05:30 IST
వెస్టిండీస్ టెస్ట్ క్రికెటర్ రకీమ్ కార్న్‌వాల్ టీ20ల్లో డబుల్‌సెంచరీ బాదాడు.
అట్లాంటా: వెస్టిండీస్ టెస్ట్ క్రికెటర్ రకీమ్ కార్న్‌వాల్ టీ20ల్లో డబుల్‌సెంచరీ బాదాడు. అట్లాంటా టీ20 టోర్నీలో అట్లాంటా ఫైర్ తరపున రఖీమ్ (77 బంతుల్లో 17 ఫోర్లు, 22 సిక్స్‌లతో 205 నాటౌట్) చెలరేగడంతో ఆ జట్టు 326/1 చేసింది. అనంతరం ప్రత్యర్థి స్క్వేర్‌డ్రైవ్ జట్టు 154/8 స్కోరుకే పరిమితమైంది. ఇది ఐసీసీ గుర్తింపులేని టోర్నీకనుక ఈ ఘనత రికార్డుల్లోకి ఎక్కదు.