అమ్మాయిలకు నిరాశ
ABN , First Publish Date - 2022-12-15T02:43:40+05:30 IST
ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత అమ్మాయిలు 21 పరుగులతో పరాజయం పాలయ్యారు. టాస్ కోల్పోయి
మూడో టీ20లో ఆస్ట్రేలియా గెలుపు
ముంబై: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత అమ్మాయిలు 21 పరుగులతో పరాజయం పాలయ్యారు. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. ఎలిస్ పెర్రీ (75), గ్రేస్ హ్యారిస్ (41), బేత్ మూనీ (30) సత్తా చాటారు. రేణుకా సింగ్, అంజలీ శర్వాణి, దీప్తీశర్మ, దేవికా వైద్య తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 151/7 స్కోరుకే పరిమితమైంది. షఫాలీ వర్మ (52), కెప్టెన్ హర్మన్ (37), దీప్తీశర్మ (25 నాటౌట్) రాణించారు. డార్సీ బ్రౌన్, గార్డ్నర్ రెండేసి వికెట్లు సాధించారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.