ఢిల్లీని వరించిన టాస్.. కోల్‌కతా బ్యాటింగ్

ABN , First Publish Date - 2022-04-29T00:47:20+05:30 IST

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్

ఢిల్లీని వరించిన టాస్.. కోల్‌కతా బ్యాటింగ్

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు ఎంతో కీలకం కాబట్టి హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించిన ఢిల్లీ ఏడో స్థానంలో ఉండగా, 8 మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో కేకేఆర్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకీ అత్యవసరం.


ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఖలీల్, సర్ఫరాజ్ బెంచ్‌కు పరిమితం కాగా, మార్ష్, సకారియా జట్టులోకి వచ్చారు. కోల్‌కతా జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఫించ్, హర్షిత్ రాణా, ఇంద్రజిత్ జట్టులోకి వచ్చారు.

Read more