Cricket: ప్చ్‌.. క్రికెట్‌కు నిరాశే

ABN , First Publish Date - 2022-12-30T00:17:16+05:30 IST

ఫిడే వరల్డ్‌ బ్లిట్జ్‌ చాంపియన్‌షి్‌ప మహిళల విభాగంలో గాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మెరుగైన ప్రదర్శనతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతోంది. గురువారం జరిగిన 9 రౌండ్లలో హారిక 5 గేమ్‌లు నెగ్గగా.. మూడు డ్రా చేసుకొంది.

Cricket: ప్చ్‌.. క్రికెట్‌కు నిరాశే

2022 రివైండ్‌

బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీ్‌సతో ఈ ఏడాదిని టీమిండియా ఘనంగానే ముగించింది. ఆసియాలో మనకది వరుసగా 16వ టెస్టు సిరీస్‌ విజయం. అయితే.. అంతకుముందు ఫలితాలను ఓసారి సింహావలోకనం చేసుకుంటే నిరాశే ఎదురవుతుంది. మూడు ఫార్మాట్లలోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించినా.. ఆ టోర్నీ సెమీ్‌సలో చిత్తుగా ఓడి వెనుదిరిగింది. ఈనేపథ్యంలో 2022లో క్రికెట్‌ రంగాన్ని ఓసారి పరిశీలిస్తే..

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): భారత క్రికెట్‌కు ఈ ఏడాది.. దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ ఓటమితో ఆరంభమైంది. ఆ వెంటనే విరాట్‌ కోహ్లీ ఈ ఫార్మాట్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. అంతకు ముందే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో, మరో పరాభవం ఎందుకనుకున్నాడో ఏమో కానీ టెస్టు బాధ్యతల నుంచి తనే వైదొలగాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇక ఏడాది చివరికి వచ్చే సరికి టీ20 కెప్టెన్సీ విషయంలోనూ రోహిత్‌ శర్మకు ఇలాంటి అనుభవమే ఎదురుకావడం గమనార్హం. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌లో బీసీసీఐ హార్దిక్‌ పాండ్యా వైపు చూస్తోంది. ఆసియాకప్‌, టీ20 ప్రపంచక్‌పలో వైఫల్యం కారణంగా శ్రీలంక సిరీస్‌ కోసం జట్టు పగ్గాలు హార్దిక్‌కు అప్పగించారు. మరోవైపు ఎప్పటిలాగే అంతర్జాతీయ ఈవెంట్స్‌లో టీమిండియా ఈసారి కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

పేలవ నిర్ణయాలు

సిరీ్‌సలకు ఆటగాళ్ల ఎంపికలో సెలెక్టర్లపై, తుది జట్టు ఎంపికలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై ఈ ఏడాది అనేక విమర్శలు వచ్చాయి. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నిర్ణయాలు సరైన ఫలితాలనివ్వలేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీ్‌సకు పూర్తి ఫిట్‌గా లేని బుమ్రాను ఆడించడంతో అతడి వెన్నునొప్పి తిరగబెట్టి కీలక టీ20 ప్రపంచక్‌పనకు దూరమయ్యాడు. అలాగే చాహల్‌ను ఈ టోర్నీలో పక్కనబెట్టడం, ఇటీవల బంగ్లాతో తొలి టెస్టును గెలిపించిన కుల్దీప్‌ను తర్వాతి మ్యాచ్‌లోనే తప్పించడం ద్రవిడ్‌ సమర్థించుకోలేని తప్పిదాలే. దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నా కొంత మందిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్టార్లనే నమ్ముకుంటూ జట్టు ఆటతీరును దెబ్బతీస్తున్నారని అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.

వెటరన్స్‌ ఫామ్‌ లేమి

సీనియర్‌ ఆటగాళ్లుగా పేరుతెచ్చుకున్న రోహిత్‌, విరాట్‌, రాహుల్‌ల ప్రదర్శన ఓవరాల్‌గా ఈ ఏడాదిలో ఆకట్టుకోలేకపోయింది. రోహిత్‌ను గాయాలు వెంటాడుతుండగా.. కోహ్లీ ఏడాది ఆఖర్లో కాస్త బ్యాట్‌ ఝుళిపించగలిగాడు. అఫ్ఘాన్‌తో టీ20లో, బంగ్లాపై వన్డేలో కోహ్లీ శతకాలు బాదినా అవి ప్రాధాన్యంలేని మ్యాచ్‌లే అయ్యాయి. అయితే మెగా టోర్నీలో పాక్‌పై అతడి ఇన్నింగ్స్‌ మాత్రం చిరస్మరణీయమే. ముఖ్యంగా రాహుల్‌ మాత్రం తీవ్ర విమర్శలే ఎదుర్కొంటున్నాడు. భవిష్యత్‌ కెప్టెన్‌గా అతడిని చూసినా నిరుత్సాహపరిచాడు. దీంతో టీ20 వైస్‌ కెప్టెన్సీని సూర్యకుమార్‌కు, వన్డేల్లో హార్దిక్‌కు కోల్పోవాల్సి వచ్చింది.

ఆశాజనకంగా యువ తారలు

కొత్త తరం ఆటగాళ్లు గిల్‌, ఇషాన్‌ తమ సత్తా నిరూపించుకుని జట్టులో పాగా వేశారు. ఈ ఏడాది వారికి ఉత్సాహాన్నిచ్చింది. అటు కశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ట్రాక్‌లోకి వస్తుండడం భారత పేస్‌కు శుభసూచకం. సంజూ శాంసన్‌కు ఆశించిన అవకాశాలు రాకపోయినా బరిలోకి దిగితే రాణిస్తున్నాడు. అటు సూర్యకుమార్‌ పరిమిత ఓవర్లలో ఇప్పటికే జట్టు ప్రధాన బ్యాటర్‌గా మారాడు. టెస్టు, వన్డేల్లో శ్రేయాస్‌ రాణించగా.. పంత్‌ మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రమే మెరిశాడు. రుతురాజ్‌ జట్టుతో ఉంటున్నా బరిలోకి దిగలేకపోతున్నాడు.

వీరి ఆట ముగిసినట్టే..

ఈ ఏడాది వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, దినేశ్‌ కార్తీక్‌లతో పాటుగా ఇటీవల లంకతో సిరీ్‌సకు పక్కనబెట్టిన ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ కెరీర్‌ కూడా ముగిసినట్టే. యువ ఆటగాళ్లు దూసుకొస్తున్న తరుణంలో ఇక వీరు జాతీయ జట్టుకు ఆడే అవకాశం లేదు. అలాగే ఈ ఏడాది కేవలం రెండు టెస్టులే ఆడిన రహానె బంగ్లాతో సిరీ్‌సకు స్థానం కోల్పోవడంతో అతడి అవకాశాలు కూడా సన్నగిల్లాయి. అంతేకాకుండా టీ20 వరల్డ్‌క్‌పలో పరాజయానికి బాధ్యతగా చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీని కూడా బీసీసీఐ రద్దు చేసింది. ఏదిఏమైనా ఈ చేదు అనుభవాలను అధిగమిస్తూ కొత్త ఏడాదిని సరికొత్తగా ఆరంభించి మెగా ఈవెంట్లలో భారత జట్టు విజయ బావుటా ఎగురవేయాలని ఆశిద్దాం.


బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీ్‌సతో ఈ ఏడాదిని టీమిండియా ఘనంగానే ముగించింది. ఆసియాలో మనకది వరుసగా 16వ టెస్టు సిరీస్‌ విజయం. అయితే.. అంతకుముందు ఫలితాలను ఓసారి సింహావలోకనం చేసుకుంటే నిరాశే ఎదురవుతుంది.

HYDRABAD

Updated Date - 2023-01-09T01:10:11+05:30 IST