‘కామన్వెల్త్’లో షూటింగ్ పునరాగమనం
ABN , First Publish Date - 2022-10-07T09:02:21+05:30 IST
కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ పునరాగమనం చేసింది. అయితే విక్టోరియా (ఆస్ట్రేలియా) ఆతిథ్యమిచ్చే 2026 కామన్వెల్త్ గేమ్స్‌నుంచి రెజ్లింగ్‌ను తొలగించారు.
రెజ్లింగ్‌కు నిరాశ
గాంధీనగర్: కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ పునరాగమనం చేసింది. అయితే విక్టోరియా (ఆస్ట్రేలియా) ఆతిథ్యమిచ్చే 2026 కామన్వెల్త్ గేమ్స్‌నుంచి రెజ్లింగ్‌ను తొలగించారు. ఈ మేరకు ‘విక్టోరియా’ నిర్వాహకులు క్రీడల పూర్తి కార్యక్రమాన్ని ప్రకటించారు. కాగా..గత జూలైలో ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌నుంచి షూటింగ్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. విక్టోరియా కామన్వెల్త్ క్రీడల నుంచి రెజ్లింగ్‌ను తొలగించడంపై..భారత రెజ్లింగ్ సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ చర్య దరిమిలా విక్టోరియా గేమ్స్‌ను బహిష్కరించాలని సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పిలుపునిచ్చారు. బర్మింగ్‌హామ్‌లో భారత రెజ్లర్లు మొత్తం 12 పతకాలు (ఆరు స్వర్ణ, ఒక రజతం, ఐదు కాంస్యాలు) సాధించారు.