Commonwealth Games: నేటి అప్డేట్స్!
ABN , First Publish Date - 2022-08-04T23:13:19+05:30 IST
కామన్వెల్త్ గేమ్స్ (commonwealth games)లో భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. బాక్సర్ అమిత్ పంఘల్(Amit Panghal

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ (commonwealth games)లో భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. బాక్సర్ అమిత్ పంఘల్(Amit Panghal) భారత్‌కు మరో పతకం ఖాయం చేశాడు. స్కాట్లాండ్ బాక్సర్ లెనన్ ములిగన్‌తో జరిగిన ఫ్లైవెయిట్ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించిన అమిత్ సెమీస్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం ఖాయం చేశాడు. మరో ముగ్గురు బాక్సర్లు క్వార్టర్స్‌లో తలపడుతున్నారు. వారు కూడా సెమీస్‌కు దూసుకెళ్తే పతకాలు ఖాయమైనట్టే. అథ్లెటిక్స్‌లో హిమదాస్(hima das) 200 మీటర్ల సెమీస్‌లోకి ప్రవేశించింది.
హేమర్ త్రోలో మంజుబాల (manju bala) ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లలో షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) విజయం సాధించారు. కామన్వెల్త్లో భారత్‌కు ఇప్పటి వరకు 18 పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి.