ఐసోలేషన్‌లోకి ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్

ABN , First Publish Date - 2022-04-22T23:51:41+05:30 IST

రాజస్థాన్ రాయల్స్‌తో కీలక మ్యాచ్ జరగనున్న వేళ ఢిల్లీ కేపిటల్స్ కోచ్ రికీపాంటింగ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు

ఐసోలేషన్‌లోకి ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్

ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో కీలక మ్యాచ్ జరగనున్న వేళ ఢిల్లీ కేపిటల్స్ కోచ్ రికీపాంటింగ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. హోటల్‌లో పాంటింగ్‌తో పాటు ఉంటున్న కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా బారినపడడంతో పాంటింగ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. దీంతో గురు, శుక్రవారాల్లో ఆటగాళ్లు, సపోర్ట్  సిబ్బంది, కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. 


పాంటింగ్‌కు రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్‌గానే వచ్చినప్పటికీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాంటింగ్‌ను ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాలని మేనేజ్‌మెంట్, మెడికల్ టీం నిర్ణయించింది. దీంతో నేటి మ్యాచ్‌కు పాంటింగ్ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.  


పాంటింగ్ అందుబాటులో లేకపోవడంతో జట్టు సపోర్ట్  స్టాఫ్ అయిన ప్రవీణ్ ఆమ్రే, అజిత్ అగార్కర్, జేమ్స్ హోప్స్, షేన్ వాట్సన్ నేటి మ్యాచ్‌కు బ్యాక్‌రూమ్ వ్యూహాలను రచించనున్నారు. కాగా, డీసీ క్యాంపులోని ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్, మిచెల్ మార్ష్‌తోపాటు నలుగురు సహాయక సిబ్బంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-04-22T23:51:41+05:30 IST