అప్పుడు యువీ ఇప్పుడు బుమ్రా
ABN , First Publish Date - 2022-07-03T09:41:53+05:30 IST
తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బుమ్రా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం రెండో రోజు ఆటలో హైలైట్.

టెస్టుల్లో లారా ప్రపంచ రికార్డు బద్దలు
అప్పుడూ.. ఇప్పుడూ బౌలర్ అతడే
బుమ్రా విధ్వంసం సాగిందిలా..
83.1 : ఫోర్ (హుక్ షాట్.. ఎడ్జ్ తీసుకొన్న బంతి బౌండ్రీకి)
83.2 : 5 వైడ్లు (షార్ట్ బాల్.. కీపర్ బిల్లింగ్స్ అందుకోలేకపోయాడు)
83.2 : నోబాల్ (సిక్స్) (హుక్ షాట్.. ఎడ్జ్ తీసుకొన్న బంతి బౌండ్రీ ఆవలకు)
83.2 : ఫోర్ (మిడాన్ మీదుగా బౌండ్రీకి)
83.3 : ఫోర్ (ఫైన్ లెగ్ మీదుగా బౌండ్రీకి)
83.4 : ఫోర్ (మిడ్‌వికెట్ దిశగా మరో బౌండ్రీ)
83.5 : సిక్స్ (షార్ట్ బాల్.. డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండ్రీకి ఆవలకు)
83.6 : సింగిల్ రన్
తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బుమ్రా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం రెండో రోజు ఆటలో హైలైట్. బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో బుమ్రా బ్యాట్ నుంచి 29 పరుగులు రాగా.. ఎక్స్‌ట్రాలు 6 పరుగులతో కలసి ఆ ఓవర్లో ఏకంగా 35 పరుగులు లభించాయి. అంతకుముందు ఒక్క బంతిని మాత్రమే ఎదుర్కొన్న బుమ్రా.. ఒక్కసారిగా శివాలెత్తాడు. అతడు ఆడిన తీరును చూసిన ఫ్యాన్స్.. 2007 టీ20 వరల్డ్‌క్‌పలో బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన యువరాజ్ సింగ్‌ను గుర్తు చేసుకున్నారు. అప్పుడు యువీ దెబ్బకు టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 36 పరుగులిచ్చిన చెత్త రికార్డును మూటగట్టుకొన్న బ్రాడ్.. ఇప్పుడు బుమ్రా చేతిలో టెస్టుల్లోనూ ఓ ఓవర్లో అత్యధికంగా 35 పరుగులిచ్చిన మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. అంటే అటు టీ-20, ఇటు టెస్టుల్లోనూ చెత్త వరల్డ్‌రికార్డు బ్రాడ్దేనన్న మాట. కాగా యువీ తుఫాను ఇన్నింగ్స్ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి.. బుమ్రా రికార్డు సమయంలో కూడా వ్యాఖ్యాతగా ఉండడం విశేషం.

