Bangladesh vs India 1st Test: లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..
ABN , First Publish Date - 2022-12-14T11:55:32+05:30 IST
(Bangladesh vs India 1st Test)బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్
చిట్టగాంగ్: (Bangladesh vs India 1st Test)బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాహుల్, గిల్ 41 పరుగులు జోడించారు. వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్న జోడిని ఖలిద్ అహ్మద్ విడదీశాడు. ఖలిద్ బౌలింగ్ రాహుల్ (22) క్లీన్ బౌల్డ్ కాగా, తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీకి, గిల్ (20), వెంటనే ఇస్లామ్ బౌలింగ్ ఔటయ్యారు. తొలి రోజు తొలి టెస్టులో లంచ్ సమయానికి భారత్ కీలకమైన మూడు వికెట్లను 48 పరుగులకే కోల్పోయింది. దీంతో భారత్ 48 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 26 ఓవర్లలో 90 రన్స్ చేసింది. క్రీజులో పంత్ (29), పుజారా (12) కొనసాగుతున్నారు.