Bangladesh - India first test: శ్రేయాస్ సెంచరీ మిస్..
ABN , First Publish Date - 2022-12-15T11:43:11+05:30 IST
బంగ్లాదేశ్ - ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ - ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు (Bangladesh - India first test)రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 278/6 తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆట ఆరంభంలోనే సెంచరీకి చేరువలో ఉన్న అయ్యర్ (86) వద్ద ఔటయ్యాడు. దీంతో నిన్న పుజారా, నేడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీ కూడా మిస్సైంది. ఎబాడట్ బౌలింగ్ లో 97.6వ ఓవర్లో శ్రేయాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అయ్యర్ సెంచరీ చేస్తాడనుకున్న అభిమానుల ఆశలను నిరాశపరిచాడు. ఏడో వికెట్ ను భారత్ 293 పరుగుల వద్ద కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్, (40), కుల్దీప్ యాదవ్ (21) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే..ఎనిమిదవ వికెట్కు అశ్విన్, కుల్దీప్ యాదవ్ 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు లంచ్ సమయానికి భారత్ స్కోర్ 120 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది.