సెమీస్‌లో అసోం

ABN , First Publish Date - 2022-11-29T01:02:02+05:30 IST

రియాన్‌ పరాగ్‌ (116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో 174) సూపర్‌ సెంచరీతో విజృంభించడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌ను ఓడించి

సెమీస్‌లో అసోం

అహ్మదాబాద్‌: రియాన్‌ పరాగ్‌ (116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో 174) సూపర్‌ సెంచరీతో విజృంభించడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌ను ఓడించి అసోం జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో అసోం 7 వికెట్లతో జమ్మూపై విజయం సాధించింది. తొలుత జమ్మూ.. ఓపెనర్‌ శుభమ్‌ ఖజూరియా (120), హెనాన్‌ నజీర్‌ (124) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 350/7 స్కోరు చేసింది. భారీస్కోరు ఛేదనలో అసోం..రియాన్‌ పరాగ్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు రిషవ్‌ దాస్‌ (114 నాటౌట్‌) అజేయ సెంచరీతో సహకరించడంతో 46.1 ఓవర్లలో 354/3 స్కోరు చేసి నెగ్గింది. బుధవారం జరిగే సెమీ్‌సలో మహారాష్ట్రతో అసోం తలపడనుంది.

కర్ణాటకతో సౌరాష్ట్ర అమీతుమీ

పంజాబ్‌తో క్వార్టర్‌ఫైనల్లో కర్ణాటక 4 వికెట్లతో గెలుపొంది సెమీస్‌ చేరింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (109) సెంచరీతో రాణించడంతో పంజాబ్‌ 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో కర్ణాటక 49.2 ఓవర్లలో 238/6 స్కోరు చేసి గెలిచింది. మరో క్వార్టర్స్‌లో సౌరాష్ట్ర 44 పరుగుల తేడాతో తమిళనాడును ఓడించి కర్ణాటకతో సెమీస్‌ పోరుకు సిద్ధమైంది. తొలుత సౌరాష్ట్ర.. హార్విక్‌ (61), చిరాగ్‌ (52), అర్పిత్‌ (51) అర్ధసెంచరీలు సాధించడంతో 50 ఓవర్లలో 293/8 స్కోరు చేసింది. తర్వాత తమిళనాడు 48 ఓవర్లలో 249 పరుగులకే కుప్పకూలింది.

Updated Date - 2022-11-29T01:02:03+05:30 IST