శ్రీలంకలో ఆసియాకప్
ABN , First Publish Date - 2022-03-20T09:13:04+05:30 IST
శ్రీలంకలో ఆసియాకప్

కొలంబో: ఈ ఏడాది ఆసియాకప్‌నకు శ్రీలంక ఆతిథ్యమి వ్వనుంది. ఆగస్టు 27నుంచి సెప్టెంబరు 11వరకు టోర్నీ జరుగుతుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌లతో పాటు క్వాలిఫై మ్యాచ్‌ల ద్వారా మరో ఆసియా జట్టు ఇందులో పాల్గొంటుంది. అయితే ఈసారి మ్యాచ్‌లను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి క్వాలిఫై మ్యాచ్‌లతో టోర్నీ మొదలవుతుంది. ఇదిలావుండగా ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న బీసీసీఐ కార్యదర్శి జైషా పదవీకాలాన్ని మరో ఏడాది అంటే.. 2024 వరకు పొడిగించారు.