కార్ల్‌సన్‌కు అర్జున్‌ ఝలక్‌

ABN , First Publish Date - 2022-10-17T09:41:16+05:30 IST

యువ గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి సంచలనం సృష్టించాడు. ఎయిమ్‌ చెస్‌ ర్యాపిడ్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు తొలిసారి ఝలక్‌ ఇచ్చాడు.

కార్ల్‌సన్‌కు అర్జున్‌ ఝలక్‌

ఎయిమ్‌ చెస్‌ ర్యాపిడ్‌ టోర్నీ

చెన్నై: యువ గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి సంచలనం సృష్టించాడు. ఎయిమ్‌ చెస్‌ ర్యాపిడ్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు తొలిసారి ఝలక్‌ ఇచ్చాడు. ఏడో రౌండ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్‌ 54 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఇక ఆదివారం జరిగిన 8వ రౌండ్‌లో క్రిజి్‌సస్టా్‌ఫ (పోలెండ్‌)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అర్జున్‌.. 9వ రౌండ్‌లో   మమెద్యరోవ్‌ (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడాడు. కానీ, 10వ రౌండ్‌లో ఎరిక్‌ హన్సెన్‌ (కెనడా), 11వ రౌండ్‌లో విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ)పై వరుసగా గెలిచి బలంగా పుంజుకున్నాడు. కాగా, మరో భారత గ్రాండ్‌ మాస్టర్‌ పెంట్యాల హరికృష్ణ.. తొమ్మిదో రౌండ్‌లో ఎట్టకేలకు గెలుపును నమోదు చేశాడు. 

Updated Date - 2022-10-17T09:41:16+05:30 IST