అప్నా టైం ఆగయా: భారత్ థామస్ కప్ విజయంపై ఆనంద్ మహీంద్రా

ABN , First Publish Date - 2022-05-15T22:49:01+05:30 IST

థామస్ కప్‌ ఫైనల్‌లో 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో చిత్తుచేసిన భారత జట్టుపై దేశవ్యాప్తంగా

అప్నా టైం ఆగయా: భారత్ థామస్ కప్ విజయంపై ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: థామస్ కప్‌ ఫైనల్‌లో 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో చిత్తుచేసి స్వర్ణ పతకం అందించిన భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. 73 ఏళ్ల థామస్, ఉబర్ కప్ చరిత్రలో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కాగా, బలమైన ఇండోనేషియాను ఖాతా కూడా తెరవకుండా కళ్లెం వేసిన భారత జట్టు సువర్ణాధ్యాయం లిఖించింది. దేశానికి స్వర్ణం అందించిన టీమిండియాకు భారత క్రీడల శాఖా మంత్రి అనురాగ్ థాకూర్ కోటి రూపాయల నజరానా ప్రకటించారు.


భారత జట్టు విజయంపై తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. క్రీడల్లో భారతీయ ఆధిక్యత శకానికి ఈ విజయం నాంది అని ట్వీట్ చేశారు. తాను థామస్ కప్ గురించి చదువుతూ పెరిగానని, ఇండోనేషియాకు చెందిన రూడీ హర్టోనో వంటి టైటాన్లు ఆధిపత్యం చెలాయించారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు మనం అలాంటి ఇండోనేషియాను తుడిచిపెట్టేశామని పేర్కొన్న ఆనంద్ మహీంద్రా.. ‘అప్నా టైం ఆగయా’ అని ట్వీట్ చేశారు. Updated Date - 2022-05-15T22:49:01+05:30 IST