Messi : మెస్సీకి హెచ్చరిక

ABN , First Publish Date - 2022-11-29T01:09:50+05:30 IST

మెక్సికోపై విజయంతో అర్జెంటీనా జట్టుకు పెద్ద ఊరట లభించింది. ఈ నేపథ్యంలో డ్రెస్సిం గ్‌ రూమ్‌లో ఆ టీమ్‌ ఆటగాళ్లు సంబరాలు

Messi : మెస్సీకి హెచ్చరిక

మా జెండాను అవమానించాడు

మెక్సికో బాక్సర్‌ మండిపాటు

దోహా: మెక్సికోపై విజయంతో అర్జెంటీనా జట్టుకు పెద్ద ఊరట లభించింది. ఈ నేపథ్యంలో డ్రెస్సిం గ్‌ రూమ్‌లో ఆ టీమ్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకొంటున్న వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో తమ జాతీయ జెండా, జెర్సీని మెస్సీ అవమానించాడని మెక్సికో బాక్సర్‌ సౌల్‌ కనేలో అల్వరజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మెస్సీ.. మా జెండా, జెర్సీతో ఫ్లోర్‌ తుడుస్తున్నాడ’ని ట్వీట్‌ చేశాడు. అర్జెంటీనాను తాము ఎలా గౌరవిస్తామో.. వారు కూడా అలాగే వ్యవహరించాలని సూచించాడు. మరో అడుగు ముందుకేసి మెస్సీని హెచ్చరించాడు. ‘నా చేతికి దొరక్కూడదని అతడు దేవుడిని ప్రార్థిస్తే మంచిది’ అని కూడా ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2022-11-29T01:09:51+05:30 IST