Morocco fans : మొరాకో ఫ్యాన్స్‌ కోసం 30 విమానాలు

ABN , First Publish Date - 2022-12-13T03:37:14+05:30 IST

అండర్‌ డాగ్‌ మొరాకో సెమీస్‌ చేరడంతో ఆ దేశంలో సందడి వాతావరణం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీ్‌సలో

 Morocco fans : మొరాకో ఫ్యాన్స్‌ కోసం 30 విమానాలు

రబాట్‌ (మొరాకో): అండర్‌ డాగ్‌ మొరాకో సెమీస్‌ చేరడంతో ఆ దేశంలో సందడి వాతావరణం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీ్‌సలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో మొరాకో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌ కోసం మొరాకో అభిమానులు భారీ ఎత్తున ఖతార్‌ చేరుకోనున్నారు. ఇందుకోసం రాయల్‌ ఎయిర్‌ మొరాకో 30 ప్రత్యేక విమానాలను నడపనుంది. రాయితీలను కూడా ప్రకటించడంతో.. ఫ్రాన్స్‌ అభిమానులకు దీటుగా స్టేడియంలో హంగామా చేయడానికి మొరాకో ఫ్యాన్స్‌ సిద్ధమైపోతున్నారు.

Updated Date - 2022-12-13T03:37:15+05:30 IST