#SSM28: సంగీత దర్శకుల పుకార్లకు తెరదించిన నిర్మాత

ABN , First Publish Date - 2022-11-23T14:02:14+05:30 IST

సంగీత దర్శకుడు థమన్ ను మార్చి అనిరుధ్ రవిచందర్ ని పెట్టుకున్నారని. అయితే ఈ వార్త చాలా వైరల్ అయింది. మహేష్ బాబు అభిమానులు కూడా దీని మీద స్పందించి ఒకానొక సమయం లో వాళ్ళు కూడా థమన్ ని మార్చారేమో అని అనుకున్నారు. వీటన్నిటికి తెర దించుతూ నిర్మాత నాగవంశీ బుధవారం ఒక ట్వీట్ చేసాడు

#SSM28: సంగీత దర్శకుల పుకార్లకు తెరదించిన నిర్మాత
Producer Naga Vamsi, director Trivikram Srinivas, Mahesh Babu and music director SS Thaman

గత కొన్ని రోజులుగా సాంఘీక మాధ్యమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా మీద వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడు థమన్ ను మార్చి అనిరుధ్ రవిచందర్ ని పెట్టుకున్నారని. అయితే ఈ వార్త చాలా వైరల్ అయింది. మహేష్ బాబు అభిమానులు కూడా దీని మీద స్పందించి ఒకానొక సమయం లో వాళ్ళు కూడా థమన్ ని మార్చారేమో అని అనుకున్నారు. వీటన్నిటికి తెర దించుతూ నిర్మాత నాగవంశీ బుధవారం ఒక ట్వీట్ చేసాడు. సంగీత దర్శకుడు థమన్ పుట్టిన రోజు నవంబర్ 22 అయితే, నిర్మాత నాగ వంశి మరుసటి రోజు అంటే ఈరోజు నవంబర్ 23 న ఈ ట్వీట్ చేసి అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. తాను నిన్న చెప్పలేకపోయానని, అందరి అభిమానులాగే తాను కూడా మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా పాటల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ ట్వీట్ లో చెప్పాడు. అలాగే ఈ ఇయర్ బ్లాక్బస్టర్ ఇయర్ అవుతుందని చెప్పాడు అందులో. ఈ ట్వీట్ తో నాగవంశీ సంగీత దర్శకుడుని మారుస్తున్నారు అన్న వార్తలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసాడు. థమన్ సంగీత దర్శకుడు, అనిరుద్ కాదు ని చెప్పేసాడు ఈ ట్వీట్ తో. చాల తెలివిగా ఈ ట్వీట్ చేసిన నాగ వంశి, ఒక్క దెబ్బకి చాలా వాటికీ సమాధానం చెప్పేసాడు.

Updated Date - 2022-11-23T14:02:17+05:30 IST