Naga Chaitanya: ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్.. మూవీ టైటిల్ ఇదే..

ABN , First Publish Date - 2022-11-23T12:25:04+05:30 IST

టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya), తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Naga Chaitanya: ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్.. మూవీ టైటిల్ ఇదే..

టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya), తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్ ఈ మూవీ చై కెరీర్‌లో 22వ చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ని చై పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి ‘కస్టడీ’ (Custody) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

అందులో చై పోలీసు డ్రెస్‌లో ఉన్నాడు. అయితే.. ఆయన చుట్టూ చాలా మంది పోలీసులు గన్నులతో చైనే ఎయిమ్ చేసి ఉన్నారు. మరికొందరేమో చైని కదలకుండా పట్టుకుని ఉన్నారు. అలాగే ఆ పోస్టర్ మీద.. ‘ప్రపంచం మార్చాలి అనుకుంటే.. నువ్వు మారాలి’ అని రాసి ఉంది. ఇదంతా చూస్తుంటే తన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మార్చేందుకు ప్రయత్నించే ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చై నటిస్తున్నట్లు అర్థం అవుతోంది. కాగా.. ఈ సినిమాలో చైకి జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా.. ప్రియమణి, శరత్‌ కుమార్, అరవిందస్వామి, ప్రేమ్‌ జీ, వెన్నెల కిషోర్, సంపత్‌ రామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2022-11-23T12:25:06+05:30 IST