ileana: బీచ్‌లో ఇల్లీబేబీ ఒంపులు!
ABN , First Publish Date - 2022-11-11T14:05:29+05:30 IST
బీచ్, బికినీకి కేరాఫ్ అడ్రస్ గోవా బ్యూటీ ఇలియానా. సముద్ర తీరాన సరదాగా గడపడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. నెలలో ఒకసారైనా ఏదో ఒక బీచ్‌లో దర్శనమిస్తారామె. నెలరోజులుగా ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను గమనిస్తే బీచ్ ఫొటోలతో సందడిగా కనిపిస్తోంది.
బీచ్, బికినీకి కేరాఫ్ అడ్రస్ గోవా బ్యూటీ ఇలియానా(ileana). సముద్ర తీరాన సరదాగా గడపడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. నెలలో ఒకసారైనా ఏదో ఒక బీచ్‌లో దర్శనమిస్తారామె. నెలరోజులుగా ఇలియానా (ileana Bikini)ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను గమనిస్తే బీచ్ ఫొటోలతో సందడిగా కనిపిస్తోంది. నవంబర్ ఒకటో తేదిన తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా బీచ్ ప్రాంతంలోనే నిర్వహించుకొంది. వైట్ అండ్ వైట్ బికినీలో సముద్ర తీరాన ఇసుకలో మోకాలిపై కూర్చుని కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ సన్ కిస్డ్ బికినీ (Sun kissed pic)ఫోటోను షేర్ చేసి కృతజ్ఞతలు తెలిపింది.

‘‘నా పుట్టినరోజున చాలా ప్రేమను పొందాను. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకను నా కుటుంబం.. కొత్తగా నేను స్నేహితులు అని పిలుచుకుంటున్న కొంతమంది అద్భుతమైన వ్యక్తులతో గడిపాను. ఇలా ఆనందంగా గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మరికొన్ని ఫొటోలు త్వరలో షేర్ చేస్తా. బీచ్‌లో నా ఫొటోలు తీసిన విహాన్ సమత్‌కు కృతజ్ఞతలు’’ అంటూ రాసుకొచ్చింది ఇలియానా. చాలాకాలంగా టాలీవుడ్‌లో అవకాశాలు లేని ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌పైనే దృష్టిపెట్టారు. హిందీలో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు ఇలియానా.