open heart with rk: నాకెవ్వరూ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేయలేదు.. ఎందుకంటే.

ABN , First Publish Date - 2022-11-04T13:42:22+05:30 IST

హీరోలంతా ఎక్కువగా డ్యాన్స్ చేయరు. డ్యూయట్ సాంగ్స్‌లో కూడా హీరోయిన్సే ఎక్కువ చేస్తుంటారు. హీరోలు వారి చుట్టూ తిరుగుతుంటారు..

open heart with rk: నాకెవ్వరూ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేయలేదు.. ఎందుకంటే.
L Vijayalakshmi Open Heart with RK

బాల నటిగా ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై నటి ఎల్. విజయలక్ష్మి (L Vijayalakshmi).. ఆ తర్వాత జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు - బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి.. మంచి గుర్తింపును పొందారు. అలనాటి అందాల తారలలో ఆమె కూడా ఒకరు. తన నటనతో, నృత్యంతో అప్పటి ప్రేక్షకులను ఊర్రూతలూగించిన ఎల్. విజయలక్ష్మి.. 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ‌కి దూరంగా ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌తో సుమారు15 సినిమాలకు పైగా నటించిన కీర్తి ఆమె సొంతం. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించారు. లెజెండరీ నటుడు, యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అవార్డును అందుకున్న ఆమె.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని అప్పటి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో.. (Actress L.Vijayalakshmi Open Heart With RK)

‘‘* హీరోలంతా ఎక్కువగా డ్యాన్స్ చేయరు. డ్యూయట్ సాంగ్స్‌లో కూడా హీరోయిన్సే ఎక్కువ చేస్తుంటారు. హీరోలు వారి చుట్టూ తిరుగుతుంటారు.

* ఎన్టీఆర్‌గారిలో నాకు గురువు కనిపించారు.

* నన్ను చూడగానే.. కోడలా.. రామ్మా.. అని ఎన్టీఆర్ అనేవారు.

* అప్పట్లో నన్నెవరూ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేయలేదు. బహుశా మా నాన్నని చూసి భయపడి ఉంటారు. మా నాన్న శివ టెంపుల్‌లో నంది మాదిరిగా ఉండేవారు.

* నా భర్త నా డ్యాన్స్ చూసి.. ‘వరల్డ్ బెస్ట్ డ్యాన్సర్ నువ్వు’ అంటుంటారు.

* ఇప్పటి జనరేషన్‌కి డబ్బు, ఫేమ్ ఎక్కువ ఉండవచ్చు కానీ.. రామారావుగారితో చేసిన అవకాశం మాత్రం ఎవరికీ రాదుగా.

* సాంబార్, రసం చేయడంలో ఎక్స్‌పర్ట్‌ని..’’ ఇలా ఎన్నో విషయాలను ఆమె ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. అవన్నీ తెలియాలంటే ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘Open Heart with RK’ కార్యక్రమం చూడాల్సిందే.

Updated Date - 2022-11-13T00:16:21+05:30 IST