Rahul- Priyadarshi: ఈ ఐదేళ్లలో ఏం నేర్చుకున్నామంటే.. (OHRK Promo)

ABN , First Publish Date - 2022-11-17T20:32:47+05:30 IST

కమెడియన్లుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. విలక్షణమైన పాత్రలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటులు ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). ప్రస్తుతం ఈ ఇద్దరూ

Rahul- Priyadarshi: ఈ ఐదేళ్లలో ఏం నేర్చుకున్నామంటే.. (OHRK Promo)
Open Heart with RK

మెడియన్లుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. విలక్షణమైన పాత్రలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటులు ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). ప్రస్తుతం ఈ ఇద్దరూ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కానే కాదు. అంత డిమాండింగ్ ఉన్న నటులుగా వీరు మారారు. సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే వీరు.. అప్పుడప్పుడు నెటిజన్లను ఆటపట్టిస్తుంటారు. అయితే ఈరోజు సక్సెస్‌ఫుల్ నటులుగా ఉన్నప్పటికీ.. ఈ స్టేజ్‌కి రావడానికి వారు ఎంతగా కృషి చేశారో? ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాలలో వారేం నేర్చుకున్నారో?.. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో (Open Heart With RK Promo) తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో..

* కమెడియన్ అంటే ఇప్పుడు ఇద్దరూ ఒప్పుకోరు.. మాదంతా ఆస్కార్ లెవల్ అంటారు కదా..

* రాహుల్, రామకృష్ణ.. ఈ రెండు పేర్లేంటి?

* మీ ఇద్దరి జర్నీ అసలు ఎలా మొదలైంది?

* రాహుల్ రామకృష్ణ గడ్డం ఎప్పుడు తీసేస్తున్నారు? తీస్తే ఎవరైనా గుర్తు పడతారా?

* మేము సినిమా స్టార్స్ అయిపోయాం.. మా లెవల్ అంతా వేరు.. అంటుంటారు కదా.. మీరు కూడా అలాగే అనుకుంటారా?

* మీ ఇద్దరి భార్యలని మెచ్చుకోవాలి.. ఎందుకంటే.. ఏం లేనప్పుడే మీలోని విషయాన్ని గుర్తించారు..

* ప్రియదర్శికి ‘పెళ్లి చూపులు’.. రాహుల్‌కి.. ?

* ‘అర్జున్ రెడ్డి’.. మీ భావజాలం ప్రకారం.. అలాంటి భాష విషయంలో ఎప్పుడూ అభ్యంతరం అనిపించలేదా?

* విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మీకు మంచి స్నేహితుడు కదా.. ‘లైగర్’ (Liger) తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు?

* కొంతమంది.. మేము అట్లాంటివి చేయం అని అంటుంటారు కదా.. అలా మీరెప్పుడైనా?

* ఇంకా ఇంతకాలం పాటు మాదే హవా అని ఏమైనా అనిపిస్తుందా?

* ఈ ఐదేళ్లలో అసలేం నేర్చుకున్నారు?.. వంటి ఎన్నో ప్రశ్నలకు ఈ జాతిరత్నాలు సమాధానమిచ్చారు. అవేంటో తెలియాలంటే ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) కార్యక్రమం చూడాల్సిందే.

Updated Date - 2022-11-17T20:51:44+05:30 IST