ప్రతీకారంతో డేటింగ్ పార్ట్​నర్​గా చేరిన యువతి.. శృంగారం సమయంలో ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2022-03-15T16:35:31+05:30 IST

ప్రతీకారం తీర్చుకోవడానికి ఆన్​లైన్​ డేటింగ్ సైట్​ ద్వారా ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్న 21 ఏళ్ల యువతి.. శృంగారం సమయంలో చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రతీకారంతో డేటింగ్ పార్ట్​నర్​గా చేరిన యువతి.. శృంగారం సమయంలో ఏం చేసిందంటే..!

హెండర్సన్, నెవాడా: ప్రతీకారం తీర్చుకోవడానికి ఆన్​లైన్​ డేటింగ్ సైట్​ ద్వారా ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్న 21 ఏళ్ల యువతి.. శృంగారం సమయంలో అతడితో ప్రవర్తించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వ్యక్తిని డేటింగ్ పేరుతో హోటల్ రూమ్‌కు తీసుకెళ్లిన సదరు యువతి అదును చూసి అతడిపై కత్తితో దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఇంతకు ఆమె ఏ విషయమై ప్రతీకారం తీర్చుకుందో తెలుసా? 2020 నాటి అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్​ మిలిటరీ అధినేత ఖాసీం సులేమానీ మృతికి. అవును మీరు విన్నది నిజమే. ఈ ఘటన అనంతరం యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆమెనే స్వయంగా పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నికా నికౌబిన్ (21) అనే యువతి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆన్​లైన్ డేటింగ్​ సైట్​ ద్వారా ఓ వ్యక్తిని పరిచయం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తిని లాస్ వెగాస్‌కు సమీపంలో ఉండే నెవాడా పరిధిలోని హెండర్సన్‌లోని సన్‌సెట్ స్టేషన్ హోటల్ అండ్ క్యాసినోలో మార్చి 5న కలుద్దామని ఒప్పించింది. దాంతో ఇద్దరు కలిసి ఆ హోటల్‌లో ఓ రూమ్​ను అద్దెకు తీసుకున్నారు. ముందు అనుకున్నట్లే నికాను వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి పికాప్ చేసుకున్నాడు. అనంతరం రూమ్ బుక్ చేసుకున్న హోటల్‌కు తీసుకువచ్చాడు. హోటల్‌కు వచ్చిన తర్వాత ఇద్దరు మద్యం తాగారు. ఆ తర్వాత వారు బుక్ చేసుకున్న గదికి వచ్చారు. ఇక శృంగారంలో పాల్గొనే సమయంలో వ్యక్తి కళ్లకు గంతలు కట్టేసింది నికా. ఆ తర్వాత లైట్లు ఆర్పివేసింది. ఆ చీకటిలో వ్యక్తిని ఏమార్చి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతడి గొంతుపై కత్తితో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన బాధితుడు నిందితురాలిని పక్కకు తోసి హోటల్ గది నుంచి బయటపడ్డాడు. తీవ్ర రక్తస్రావంతోనే పోలీసులకు సమాచారం అందించాడు. అతనితో పాటే రూమ్ నుంచి బయటకు వచ్చిన నికా.. కత్తితో దాడి చేసినట్లు హోటల్ సిబ్బందికి చెప్పి అక్కడి నుంచి పరారైంది.


బాధితుడి సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నికాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించగా విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2020 నాటి యూఎస్ డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్ మిలిటరీ లీడర్ ఖాసీం సులేమానీ మృతికి ప్రతీకారంగా ఈ ఘటనకు పాల్పడినట్లు నికా చెప్పుకొచ్చింది. అంతేకాదండోయ్.. 'గ్రేవ్​.. డిగ్గర్' అనే పాట తనకు ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేరణ అని పోలీసులతో చెప్పింది. కాగా, ఇరాన్​ అగ్ర కమాండర్ జనరల్​ ఖాసీం సులేమానీ 2020 జనవరి 3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్​జీసీ)లోని అత్యంత శక్తిమంతమైన కుర్ద్​ ఫోర్స్‌కు జనరల్‌గా వ్యవహరించారు.

Updated Date - 2022-03-15T16:35:31+05:30 IST