భారత్‌కు శాశ్వతంగా తిరిగొస్తే.. NRI లకు విదేశాల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ల సంగతేంటి..?
ABN , First Publish Date - 2022-05-24T03:08:09+05:30 IST
ఎన్నారైలు తమ సంపాదన, రాబడిపోబడుల మేనేజ్ చేసుకుందుకు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, ఎఫ్సీఎన్ఆర్ అకౌంట్లను ఓపెన్ చేస్తారన్న విషయం తెలిసిందే. మరి ఇండియాకు తిరిగొచ్చాక ఈ అకౌంట్ల పరిస్థితి ఏంటి.. ? ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ మారు చూద్దాం

ఎన్నారై డెస్క్: ఎన్నారైలు తమ సంపాదన, రాబడిపోబడులను మేనేజ్ చేసుకునేందుకు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, ఎఫ్సీఎన్ఆర్ అకౌంట్లను ఓపెన్ చేస్తారన్న విషయం తెలిసిందే. మరి ఇండియాకు తిరిగొచ్చాక ఈ అకౌంట్ల పరిస్థితి ఏంటి.. ? ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓ మారు చూద్దాం.
ఇండియాకు తిరిగొచ్చిన ఎన్నారైలు.. ఎన్ఆర్ఓ(నాన్ రెసిడెన్షియల్ ఆర్డినరీ రూపీ అకౌంట్) స్టేటస్‌ను రెసిడెన్షియల్‌గా మార్చుకోవాలి. ఎన్ఆర్ఈ(నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్) విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. స్వదేశానికి వచ్చిన వెంటనే ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ అకౌంట్ స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎన్నారైలకు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఈ అకౌంట్లో ఉన్న నిధులను వారు ఆర్ఎఫ్సీ(రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్)లోకి కూడా మార్చుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ అకౌంట్లకూ ఎన్ఆర్ఈ నిబంధనలు కొంత మేర వర్తిస్తాయి. ఎన్నారైలు తమ ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్ల కాల పరిమితి పూర్తయ్యే వరకూ వాటిని యథావిథిగా కొనసాగించవచ్చు. వాటిల్లోని నగదును ఆర్ఎఫ్సీలోకి బదిలిచేసే అవకాశం కూడా ఎన్నారైలకు ఉంది.
ఎన్నారైల విదేశీ సంపాదన ఎన్ఆర్ఈ అకౌంట్లో డిపాజిట్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఇక భారత్‌లో ఆర్జించే ఆదాయం ఎన్ఆర్ఓ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. ఈ రెండూ భారత కరెన్సీలో ఉండే అకౌంట్లే. ఇక ఎఫ్సీఎన్ఆర్ అకౌంట్లో విదేశీ నగదును నిల్వ చేసుకోవచ్చు.