TRS Australia: తెలంగాణ బిడ్డలు గర్వపడే రోజు

ABN , First Publish Date - 2022-10-06T18:54:16+05:30 IST

బీఆర్ఎస్ ఏర్పాటును టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ స్వాగతించింది.

TRS Australia: తెలంగాణ బిడ్డలు గర్వపడే రోజు

టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి

ఎన్నారై డెస్క్: బీఆర్ఎస్ ఏర్పాటును టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ స్వాగతించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు ఒక్కడితో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రమంతా పాకి సకలజనులను ఏకం చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఏకంగా పార్లమెంట్ వ్యవస్థనే ప్రభావితం చేసి, ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్ సాధించారని తెలిపారు. అనంతరం దేశమంతా అబ్బురపరిచేలా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారని కొనియాడారు. నేడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి అభివృద్ది చెందుతున్న మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చబోతున్నారని జోస్యం చెప్పారు. సకల వనరులు మన దేశంలో నిక్షిప్తమైనప్పటికీ వాటిని ప్రజలకు అందించే నాయకత్వలేమితో దేశం వెనక బడిపోయిందన్నారు. తన దూర దృష్టితో తెలంగాణలో ఉన్న వనరులను ప్రజలకు అందించి నేడు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన కేసీఆర్ రేపు దేశంలో ఉన్న వనరులైన నీళ్లు, విద్యుత్తు లాంటి ఎన్నో వనరులను సద్వినియోగంలోకి తెచ్చి దేశాన్ని ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా తీర్చి దిద్దుతారని చెప్పారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం తెలంగాణ బిడ్డలందరికి గర్వకారణమన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ స్వాగతిస్తుందని నాగేందర్ రెడ్డి తెలిపారు.


Read more