H1-b వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేయనున్న అమెరికా..!
ABN , First Publish Date - 2022-06-18T03:10:26+05:30 IST
H1-b వీసా జారీలో జాప్యం కారణంగా అనేక దరఖాస్తులో పెండింగ్ ఉంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నారై డెస్క్: H1-b వీసా జారీలో జాప్యం కారణంగా అనేక దరఖాస్తులో పెండింగ్ ఉంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని H1-b పిటీషన్ల పరిశీలనను కాలిఫోర్నియా కేంద్రానికి బదిలీ చేసేందుకు నిర్ణయించింది. వర్మోంట్ కేంద్రంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు USCIS తాజా ప్రకటనలో పేర్కొంది. వివిధ రకాల వీసాల ప్రాసెసింగ్లో ఇటీవల జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. సర్వీస్ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా దరఖాస్తుల ప్రాసెసింగ్లో ఆలస్యం చోటుచేసుకుంటోంది. మరోవైపు.. అమెరికా అవసరాలకు తగ్గట్టుగా H1-b వీసాల సంఖ్య పెంచాలంటూ అమెరికా చట్టసభ సభ్యురాలు మియా లవ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలసిందే.