అమెరికా గ్రీన్‌కార్డు ఉన్న వారికి ఓ శుభవార్త..

ABN , First Publish Date - 2022-10-06T01:08:35+05:30 IST

అమెరికా గ్రీన్ కార్డు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓ శుభవార్త. ఈ దరఖాస్తుదాలరు గ్రీన్ కార్డు కాలపరిమితిని ఆటోమేటిగ్‌గా పొడిగించినట్టు పేర్కొంది.

అమెరికా గ్రీన్‌కార్డు ఉన్న వారికి ఓ శుభవార్త..

ఎన్నారై డెస్క్: అమెరికా గ్రీన్ కార్డు రెన్యూవల్(Green Card Renewal) కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓ శుభవార్త. ఈ దరఖాస్తుదారుల గ్రీన్ కార్డు కాలపరిమితిని(Validity) ఆటోమేటిగ్‌గా పొడిగించినట్టు(Extension) అమెరికా ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అత్యధిక గ్రీన్ కార్డులు పొందిని వారిలో భారతీయులు కూడా ఉన్న విషయం తెలిసిందే. 2021 ఆర్థిక సంవత్సరంలో 93450 మందికి గ్రీన్ కార్డులు దక్కాయి. కంపెనీలు స్పాన్సర్ చేసిన గ్రీన్ కార్డులు పొందేందుకు దరఖాస్తుదారులు ప్రస్తుతం మూడేళ్ల వరకూ వేచి చూడాల్సి వస్తోంది. అయితే.. అదనపు చార్జీల కింద 2500 డాలర్లు చెల్లించిన వారికి వెయిటింగ్ పీరియడ్ ఏడు నెలల వరకూ తగ్గుతుంది. 2016లో గ్రీన్ కార్డుల సగటు వెయిటింగ్ పీరియడ్ 16 నెలలకు పైగా పెరిగింది. 2021, 2022 సంవత్సరాల్లో దరఖాస్తుదారులు గ్రీన్ కార్డుల కోసం అదనంగా ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. 


ఇక గ్రీన్‌కార్డు రెన్యూవల్ చేసుకునే వారు ఐ-90 ఫార్మ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం కొంత ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాలి. యూఎస్‌సీఐఎస్ వెబ్‌సైట్‌లో గ్రీన్ కార్డు రెన్యూవల్ కోసం అప్లై చేసుకోవాలి. ఇక రెన్యూవల్ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు నెలకోసారి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతుంటాయి. రెన్యూవల్ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నప్పుడు తాత్కాలిక నివాసార్హత ధృవీకరణ ప్రతాలను కూడా అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. 

Read more